Thursday, April 23, 2026
Homeతాజా సమాచారంభారత గడ్డపై సీపీఐకు వందేళ్ల చరిత్ర – వందేళ్ల ఉత్సవాలను జయప్రదం చేయండి: పోకల వెంకటేశ్వర్లు

భారత గడ్డపై సీపీఐకు వందేళ్ల చరిత్ర – వందేళ్ల ఉత్సవాలను జయప్రదం చేయండి: పోకల వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, నవంబర్ 7, డైనమిక్

భారత గడ్డపై సీపీఐ పార్టీకి వందేళ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని, ఆ పార్టీ వందేళ్ల ఉత్సవాల భాగంగా ఈ నెల 20వ తేదీన గరిడేపల్లి మండల కేంద్రానికి రానున్న రాష్ట్ర బస్సు జాతాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో జాతాకు సంబంధించిన కరపత్రికలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ—1925 డిసెంబర్ 26న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొట్టమొదటగా డిమాండ్ చేసిన పార్టీ సీపీఐ అని, ఆ స్వాతంత్ర్య యాత్రలోనూ, తరువాత ప్రజా ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.స్వాతంత్ర్యం అనంతరం భూ సంస్కరణలు, వెట్టి చాకిరీ నిర్మూలన, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం, అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను తరిమికొట్టడంలో కమ్యూనిస్టు పార్టీ కీలక భూమిక వహించిందని ఆయన గుర్తు చేశారు.
“దున్నేవానికే భూమి” అనే నినాదంతో దొరల గడిలను బద్దలుకొట్టి పేదవారికి భూములు పంచిన చరిత్ర సీపీఐదే” అని చెప్పారు.అధికారంలో లేకున్నా పేదల పక్షాన ఎల్లప్పుడూ నిలబడుతూ వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని ఆయన వివరించారు.
ఈ ఏడాది డిసెంబర్ 26న ఖమ్మం వేదికగా జరగనున్న సీపీఐ శతవసంతాల ఉత్సవ ముగింపు సభ చారిత్రాత్మకంగా నిలుస్తుందని తెలిపారు. ఆ సభ విజయవంతం కావడానికి ప్రతి ప్రజా సంఘం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు బిల్లా కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి, యడ్ల అంజిరెడ్డి, కుందూరు వెంకటరెడ్డి, చేవా వెంకన్న, అంబటి వెంకటరెడ్డి, తిరగమళ్ళ కిరణ్, గోధుమల ఈశ్వరాచారి, పంగ సైదులు, ఈదయ్య, గోవిందరెడ్డి, ప్రతాని సైదులు, వేశాల ఆంజనేయులు, షైక్ నబిసాహెబ్, పీరిసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments