మఠంపల్లి, డైనమిక్ న్యూస్, జనవరి 22
మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని రేపు (జనవరి 23) ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన సతీమణి సుధా దేవ్ వర్మ సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గవర్నర్‌తో కలిసి పాల్గొననున్నారు.
రూ.200 కోట్ల విద్యా అభివృద్ధి పనులకు శిలాఫలక ఆవిష్కరణ
గవర్నర్–మంత్రి సమక్షంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
స్వామివారి దర్శనానంతరం ఆలయానికి సమీపంలోని గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఇందులో రూ.150 కోట్లతో హుజూర్ నగర్ ప్రభుత్వ వ్యవసాయ కళాశాల రూ.50 కోట్లతో కోదాడ జవహర్ నవోదయ విద్యాలయం
నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం గవర్నర్ ప్రసంగించనున్నారు.

హుజూర్ నగర్–కోదాడకు విద్యా రంగంలో నూతన వరవడి
గవర్నర్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి
హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై గవర్నర్ పర్యటనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
