Saturday, April 18, 2026
Homeతాజా సమాచారంజానపాడు దర్గా వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం బిక్షాటన చేస్తూ అకస్మాత్తుగా మృతి –...

జానపాడు దర్గా వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం బిక్షాటన చేస్తూ అకస్మాత్తుగా మృతి – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది

పాలకిడు, డైనమిక్ ,అక్టోబర్ 30

పాలకవిడు మండల పరిధిలోని జానపాడు దర్గా గ్రామ పరిధిలో గురువారం ఉదయం ఒక గుర్తు తెలియని మహిళ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 50 నుండి 55 సంవత్సరాల వయస్సు గల ఆ మహిళ దర్గా గెస్ట్ హౌస్ సమీపంలో బిక్షాటన చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు సమాచారం.ఈ విషయాన్ని జానపాడు దర్గా పంచాయతీ కార్యదర్శి ఎం. నాగరాజు పోలీసులకు తెలియజేయడంతో, స్థానిక ఎస్‌ఐ కోటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు సూర్యాపేట రూరల్ పోలీసులను 8712686012 లేదా 8712686055 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments