Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఓవర్‌లోడ్‌ మినీ ట్రక్కు బోల్తా.. ద్విచక్రవాహనదారుడు మృతి యూటర్న్‌ తీసుకుంటుండగా అదుపుతప్పిన ట్రక్కు రోడ్డుపై పడిన భారీ ఇనుప పైపులు.. అక్కడికక్కడే మృతి

ఓవర్‌లోడ్‌ మినీ ట్రక్కు బోల్తా.. ద్విచక్రవాహనదారుడు మృతి  యూటర్న్‌ తీసుకుంటుండగా అదుపుతప్పిన ట్రక్కు  రోడ్డుపై పడిన భారీ ఇనుప పైపులు.. అక్కడికక్కడే మృతి

ముఖ్యమైన పాయింట్స్:

  • ఓవర్‌లోడ్‌ మినీ ట్రక్కు బోల్తా.. ద్విచక్రవాహనదారుడు మృతి
  • యూటర్న్‌ తీసుకుంటుండగా అదుపుతప్పిన ట్రక్కు
  • రోడ్డుపై పడిన భారీ ఇనుప పైపులు.. అక్కడికక్కడే మృతి

మెడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్‌ 8, శుభోదయ డైనమిక్

బాలానగర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప పైపులతో అధిక లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు యూటర్న్‌ తీసుకునే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రక్కులోని భారీ ఇనుప పైపులు రోడ్డుపై పడటంతో పక్కనే ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి వాటి కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం.. బాలానగర్‌ గౌతమ్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌ పవార్‌ (56) తన హోండా యాక్టివాపై కూకట్‌పల్లి వైపు వెళ్తున్నాడు. ఆర్‌ఎన్‌సీ ఆసుపత్రుల సమీపంలో ఇనుప పైపులతో అధికంగా లోడ్‌ చేసిన మినీ ట్రక్కు యూటర్న్‌ తీసుకుంటుండగా ఒక్కసారిగా అదుపుతప్పి ఒరిగిపోయింది.దీంతో ట్రక్కులో ఉన్న భారీ ఇనుప పైపులు రోడ్డుపైకి జారి పవార్‌పై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన మినీ ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్‌ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ