Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రూ.850 కోట్లతో పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనులు

రూ.850 కోట్లతో పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనులు

ముఖ్యమైన పాయింట్స్:

  • రూ.850 కోట్లతో పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనులు
  • ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
  • కారం పూడి , అక్టోబర్‌ 5, శుభోదయ డైనమిక్

కారం పూడి , అక్టోబర్‌ 5, శుభోదయ డైనమిక్ వార్త

రూ.850 కోట్లతో పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనులు - Additional Image

మాచర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందించేందుకు జల జీవన్‌ మిషన్‌ కింద పల్నాడు వాటర్‌గ్రిడ్‌ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు.సోమవారం పేటసన్నెగండ్ల అడ్డరోడ్డు వద్ద వాటర్‌గ్రిడ్‌ పైప్‌లైన్‌ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.850 కోట్లతో గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, త్వరలో వరికశెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంగులూరి అంజయ్య, పంగులూరి పుల్లయ్య, చప్పిడి రాము, మునుగోటి సత్యం, గోళ్ల సురేష్‌ యాదవ్‌, బాలకృష్ణ, తండా మస్తాన్‌ జానీ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి