Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సెప్టిక్ ట్యాంకుల శుభ్రతకు ప్రభుత్వ చర్యలు చేపట్టాలి

సెప్టిక్ ట్యాంకుల శుభ్రతకు ప్రభుత్వ చర్యలు చేపట్టాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • సెప్టిక్ ట్యాంకుల శుభ్రతకు ప్రభుత్వ చర్యలు చేపట్టాలి
  • ప్రజలపై ఆర్థిక భారం తగ్గించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి
  • ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తక్కెళ్ళ నాగార్జున వినతి

శుభోదయ డైనమిక్ వార్త,నేరేడుచర్ల

ప్రజారోగ్యం, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా పట్టణాలు, మండలాలు, గ్రామపంచాయతీల పరిధిలోని సెప్టిక్ ట్యాంకులను ప్రభుత్వ ఆధ్వర్యంలో శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త తక్కెళ్ళ నాగార్జున కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలోమండల ఎంపిఓ నాగరాజు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ప్రస్తుతం సెప్టిక్ ట్యాంకులు నిండినప్పుడు ప్రజలు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ పారిశుధ్య కార్యక్రమాల నిబంధనలకు అనుగుణంగా సాధ్యమైన మేరకు సెప్టిక్ ట్యాంకుల శుభ్రత, నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే సురక్షిత యంత్ర పరికరాలతో శుభ్రపరిచే విధానం అమలు చేయడంతో పాటు పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు, శిక్షణ, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసి అమలు చేయాలని తక్కెళ్ళ నాగార్జున విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి