Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరు ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరు  ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ

ముఖ్యమైన పాయింట్స్:

  • పోలీసు ఉద్యోగ ఆశావహులకు ఉచిత శిక్షణ ఎంపిక పరీక్ష
  • సూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరు
  • ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ

పోలీసు ఉద్యోగ ఆశావహులకు ఉచిత శిక్షణ ఎంపిక పరీక్ష

సూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరు

ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 4, శుభోదయ డైనమిక్ న్యూస్

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న 45 రోజుల ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 1,220 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

నాలుగు కేంద్రాల్లో ఎంపిక పరీక్ష

ఇవి కూడా చదవండి

సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాల, కోదాడ కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల, హుజూర్‌నగర్ గ్రీన్‌వుడ్ పాఠశాల, తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా 1,600 మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఐఏఎస్ ప్రత్యేక చొరవతో జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 45 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకే ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత సమయాన్ని వృథా చేయకుండా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.

అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

ఎస్పీ వెంట అదనపు కలెక్టర్ ట్రైనీ ఐఏఎస్ అనుషా, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, డిప్యూటీ ఎమ్మార్వో, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.