Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు అక్టోబర్ 31 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: ఎస్పీ నరసింహ

Author
Posted By DAINAMIC NEWS
| 02 Oct 2026, 01:01 AM | తాజా సమాచారం
జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు అక్టోబర్ 31 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: ఎస్పీ నరసింహ


ముందస్తు అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలకు నిషేధం



సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 2,శుభోదయ డైనమిక్ వార్త



శాంతిభద్రతల పరిరక్షణతో పాటు జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఈ నిబంధనలు అక్టోబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.



అనుమతులు తప్పనిసరి:



30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రజలు గుమిగూడే ఇతర కార్యక్రమాలను నిర్వహించరాదని ఎస్పీ సూచించారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా దరఖాస్తు చేసుకుని సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి



ఆయుధాలు, పేలుడు పదార్థాలపై నిషేధం:



నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు తదితరాలను కలిగి ఉండరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా జనసమూహాలను ఏర్పాటు చేయడం, అవాంఛనీయ పరిస్థితులకు దారితీసే చర్యలకు పాల్పడటం నిషేధమని తెలిపారు.



డీజేలు, అధిక శబ్ద పరికరాల వినియోగానికి అనుమతి లేదు:
అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు, ప్రచార రథాలు, మైకులు తదితర శబ్ద పరికరాలను అనుమతులు లేకుండా వినియోగించరాదని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై 30 పోలీస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి, 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ నరసింహ కోరారు.