Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హుస్సైనాబాద్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ముగ్గురికి గాయాలు.. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Author
Posted By DAINAMIC NEWS
| 29 Sep 2026, 08:29 PM | తాజా సమాచారం
హుస్సైనాబాద్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ముగ్గురికి గాయాలు.. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు


మోతె,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 30



మండలంలోని హుస్సైనాబాద్ గ్రామ శివారులో బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న మైత్రి ట్రావెల్స్‌కు చెందిన NL 01 B 5579 నంబర్ గల బస్సు హుస్సైనాబాద్ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.



అతివేగమే కారణమా?



బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతోనే వాహనం అదుపుతప్పినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.



ముగ్గురికి గాయాలు



ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



పోలీసుల దర్యాప్తు



ఘటనపై మోతె ఎస్సై బి. లచ్చిరెడ్డి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.