Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అధికారుల కాళ్లు కడుగుతాం.. మా పంట పొలాలను కాపాడండి!ప్రజావాణిలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై వినూత్న నిరసన

Author
Posted By DAINAMIC NEWS
| 28 Sep 2026, 04:06 AM | తాజా సమాచారం
అధికారుల కాళ్లు కడుగుతాం.. మా పంట పొలాలను కాపాడండి!ప్రజావాణిలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై వినూత్న నిరసన


కాలువల మరమ్మతులు, నీటి సరఫరా, ఆక్రమణల తొలగింపునకు డిమాండ్



కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని తక్కెళ్ల నాగార్జున వినతి


ఇవి కూడా చదవండి


నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 28



నేరేడుచర్ల మండలం జానాలదిన్న గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్ ఎస్ పీ కాలువల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బహుజన సామాజిక కార్యకర్త తక్కెళ్ల నాగార్జున ప్రజావాణిలో వినూత్న నిరసన తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారుల పాదాలను కడిగి, సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.తమ ప్రాంతంలోని ఇరిగేషన్ సమస్యలపై పలుమార్లు మౌఖికంగా, లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని నాగార్జున తెలిపారు. కాలువల మరమ్మతులు, నీటి సరఫరా, ఆక్రమణల తొలగింపు, కాలువల శుభ్రత వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించి, సమస్యలను పరిష్కరించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని నాగార్జున కోరారు.