Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య మహా అన్నదానం

Author
Posted By DAINAMIC NEWS
| 11 Sep 2026, 10:15 PM | తాజా సమాచారం
వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య మహా అన్నదానం


జగదేవపూర్, సెప్టెంబర్ 12,శుభోదయ డైనమిక్ వార్త



సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల అంగడి బజారు వద్ద వాసవి జగదేవపూర్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.



ప్రతి అమావాస్యకు అన్నదానం


ఇవి కూడా చదవండి


ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ.. అన్నదానం మహాదానమని, దాతల సహకారంతో ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో పవిత్రమైన కార్యక్రమమని తెలిపారు. అమావాస్య రోజున అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.



దాతల సహకారంతో కొనసాగింపు



జగదేవపూర్‌లో ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గుబ్బ శ్రీనివాస్‌రావు, పెద్ది శ్రీనివాస్, వల్లాల వెంకటేశం, భాస్కర్, శంకర్, లక్ష్మీ నరసయ్య, రాములు, బాల్ నర్సయ్య, విఠలేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.