Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Author
Posted By DAINAMIC NEWS
| 28 Aug 2026, 05:42 AM | తాజా సమాచారం
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి


శుభోదయ డైనమిక్ వార్త – మోతే, ఆగస్టు 28



మోతే మండలం బోడబండ్ల గూడెం గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కొనుగోటి రంగారావు మనవరాలి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ కార్యక్రమానికి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.



వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే


ఇవి కూడా చదవండి


ఈ సందర్భంగా పద్మావతి రెడ్డి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.



పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు



కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్‌రావు, మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, గ్రామ సర్పంచ్ కంపెళ్లి ఉమా శ్రీను, ఉప సర్పంచ్ శైలేంద్రరావు, మండల నాయకులు గుండ్ల లక్ష్మారెడ్డి, మామిడి వెంకటేశ్వర్లు గౌడ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.