Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నీటి సంరక్షణ, స్వచ్ఛ భారత్ పనుల్లో వేగం పెంచాలి నేరేడుచర్లలో జిల్లా పంచాయతీ అధికారి కె. యాదగిరి సమీక్ష

Author
Posted By DAINAMIC NEWS
| 24 Jul 2026, 04:14 AM | తాజా సమాచారం
నీటి సంరక్షణ, స్వచ్ఛ భారత్ పనుల్లో వేగం పెంచాలి నేరేడుచర్లలో జిల్లా పంచాయతీ అధికారి కె. యాదగిరి సమీక్ష


నేరేడుచర్ల, జూలై 24,శుభోదయ డైనమిక్ వార్త



నేరేడుచర్ల మండల కార్యాలయంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారి కె. యాదగిరి అధ్యక్షతన నేరేడుచర్ల, పాలకీడు మండలాల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి సంరక్షణ పనులు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వీబీజీ–రంగి (VBG-RANGI) కార్యక్రమాల అమలు పురోగతిని అధికారులు సమీక్షించారు.


ఇవి కూడా చదవండి


పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశం



సమావేశంలో ఆయా కార్యక్రమాల అమలు, లక్ష్యాల సాధన, గ్రామాల వారీగా పనుల పురోగతిపై చర్చించారు. ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా పంచాయతీ అధికారి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి నీటి సంరక్షణ, పారిశుద్ధ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో నేరేడుచర్ల ఎంపీడీఓ సోమసుందర్ రెడ్డి, పాలకీడు ఎంపీడీఓ లక్ష్మి, నేరేడుచర్ల ఎంపీవో నాగరాజు, ఏపీఓ శేఖర్, ఇరు మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.