Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్లలో ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల ప్రత్యేక దృష్టి రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లకు కౌన్సిల్లింగ్

Author
Posted By DAINAMIC NEWS
| 18 May 2026, 08:32 AM | తాజా సమాచారం
నేరేడుచర్లలో ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల ప్రత్యేక దృష్టి రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లకు కౌన్సిల్లింగ్


నేరేడుచర్ల, మే 18, శుభోదయ డైనమిక్ వార్త



నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారులపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఏ. సైది రెడ్డి తన సిబ్బందితో కలిసి ప్రధాన సెంటర్ ప్రాంతాన్ని పరిశీలించారు.



ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా చర్యలు


ఇవి కూడా చదవండి


రోడ్డుకు ఆనుకుని తోపుడు బండ్లు ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులకు పోలీసులు కౌన్సిల్లింగ్ నిర్వహించారు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా బండ్లను రోడ్డుకు పక్కకు జరిపించాలని సూచించారు.



ప్రజల సహకారం అవసరం



పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్‌ఐ సైది రెడ్డి కోరారు. రోడ్లపై అక్రమంగా బండ్లు నిలిపితే ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. పోలీసులు చేపట్టిన చర్యలకు స్థానికులు మద్దతు తెలిపారు.