Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పశువుల కొమ్మలకు రేడియం స్టిక్కర్లు అంటించిన ఎస్ ఐ సైది రెడ్డి ప్రమాదాల నివారణకు నేరేడుచర్ల పోలీసులు ప్రత్యేక చర్యలు

Author
Posted By DAINAMIC NEWS
| 16 May 2026, 10:36 AM | తాజా సమాచారం
పశువుల కొమ్మలకు రేడియం స్టిక్కర్లు అంటించిన ఎస్ ఐ సైది రెడ్డి ప్రమాదాల నివారణకు నేరేడుచర్ల పోలీసులు ప్రత్యేక చర్యలు


నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, మే 16



నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, హుజూర్‌నగర్ సీఐ చలమంద రాజు సూచనలతో స్థానిక ఎస్ఐ సైదిరెడ్డి మూగజీవాల కొమ్మలకు రేడియం స్టిక్కర్లు అంటించారు.



రాత్రివేళ ప్రమాదాల నివారణే లక్ష్యం



వేసవికాలంలో రైతులు మేత కోసం పశువులను వదిలేయడంతో రాత్రి వేళల్లో అవి రోడ్లు దాటే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు పశువుల కొమ్మలకు రేడియం స్టిక్కర్లు అమర్చినట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి


రైతులకు అవగాహన



రేడియం స్టిక్కర్ల ద్వారా వాహనదారులు దూరం నుంచే పశువులను గుర్తించే అవకాశం ఉంటుందని, దీంతో మనుషులు, మూగజీవుల ప్రాణనష్టం తగ్గుతుందని రైతులకు అవగాహన కల్పించారు.



కార్యక్రమంలో పాల్గొన్న వారు



ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది లింగయ్య, నాగరాజు, ముత్యాలు, గ్రామ సర్పంచ్ మనోజ్, రైతులు పాల్గొన్నారు.