Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కనకదుర్గమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం – ఉగాది పర్వదినం సందర్భంగా విశేష కార్యక్రమాలు

Author
Posted By DAINAMIC NEWS
| 19 Mar 2026, 09:20 AM | తాజా సమాచారం
కనకదుర్గమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం – ఉగాది పర్వదినం సందర్భంగా విశేష కార్యక్రమాలు


డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 19



తెలుగు సంవత్సరాది పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో గురువారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం నిర్వహించారు.



– ప్రధాన అర్చకుల చేత పంచాంగ పఠనం



ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాధుని రంగభట్టాచార్యులు సాయంత్రం 6:30 గంటలకు పంచాంగాన్ని శ్రవణం చేశారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.


ఇవి కూడా చదవండి


– భక్తుల భారీ పాల్గొనడం



ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు బాచిమంచి కొండయ్య–అనంతలక్ష్మి దంపతులు, బాచిమంచి చంద్రం, హుజూర్‌నగర్‌కు చెందిన ప్రముఖులు ముటుకుల విజయకుమార్, ఆకుల రాము, భువనగిరి శ్యామ్, కంచర్ల రవీందర్ రెడ్డి, పులిచింతల సత్యనారాయణ రెడ్డి, శివకుమార్, నాగశ్రీ వెంకటరమణ, చింతలపూడి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



– ఉగాది సందర్బంగా ప్రత్యేక పూజలు



ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.