Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అన్నీవర్గాలకు అండగా కూటమి ప్రభుత్వంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

Author
Posted By DAINAMIC NEWS
| 18 Mar 2026, 05:31 AM | ఆంధ్ర ప్రదేశ్
అన్నీవర్గాలకు అండగా కూటమి ప్రభుత్వంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి


కారంపూడి, మార్చి 18, డైనమిక్ న్యూస్



అన్నీ వర్గాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో చొప్పవరపు వెంకాయమ్మకు రూ.48,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన పంపిణీ చేశారు.



అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి




ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ పథకం వల్ల అనేక కుటుంబాలు ఆపదలో నిలదొక్కుకుంటున్నాయని చెప్పారు.


ఇవి కూడా చదవండి


ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ




రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.



కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు




ఈ కార్యక్రమంలో కారంపూడి మండలం మాజీ కోఆప్షన్ సభ్యుడు తండ మస్తాన్ జానీ, కారంపూడి పట్టణ మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.