Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అభివృద్ధి ప్రధాత మంత్రి ఉత్తమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు– సర్పంచ్ నీమా నాయక్

Author
Posted By DAINAMIC NEWS
| 16 Mar 2026, 11:12 PM | తాజా సమాచారం
అభివృద్ధి ప్రధాత మంత్రి ఉత్తమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు– సర్పంచ్ నీమా నాయక్


పాలకవీడు, మార్చి 17,డైనమిక్ న్యూస్



పాలకవీడు మండలం శూన్యంపహాడ్ గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణ పనులను సోమవారం ఘనంగా ప్రారంభించారు. భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద రూ.20 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.



రూ.20 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం


ఇవి కూడా చదవండి


మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు రమవత్ నీమా నాయక్ స్థానిక నాయకులతో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిధులు కేటాయించినందుకు గ్రామ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.



నాయకులు, గ్రామస్తుల పాల్గొనడం



ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సపావత్ నాగు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కేశ్యా, మాజీ సర్పంచ్ బీక్య, మాజీ ఉపసర్పంచ్లు సపావత్ రాము, చీన, బంగ్య పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు దేశ్యా, రమేష్, మక్తీ, నీలా, సక్రు, చందు, చందర్ రావు, సీనియర్ నాయకులు కేష్య, గ్రామ ఉపాధ్యక్షులు అబ్రహం, వాస్య, రతన్, మీత్య, బాలు, బొడ్క, నంద, కృష్ణ, శ్రీను, మాలు, కళ్యాణ్, చందర్ సింగ్, శంకర్ బాబు, మహేష్, పృథ్వి, శివ, హంక్య, అఖిల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.