Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా హుజూర్ నగర్‌లో కేక్ కట్ చేసి బిర్యానీ పంపిణీ

Author
Posted By DAINAMIC NEWS
| 14 Mar 2026, 08:33 AM | తాజా సమాచారం
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా హుజూర్ నగర్‌లో కేక్ కట్ చేసి బిర్యానీ పంపిణీ


డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, మార్చి 14



జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో కేక్ కట్ చేసి కార్మికులు, విద్యార్థులు, ప్రజలకు బిర్యానీ పంపిణీ చేశారు.



పార్టీ బలోపేతానికి కృషి


ఇవి కూడా చదవండి


ఈ సందర్భంగా సరికొప్పుల నాగేశ్వర రావు మాట్లాడుతూ జనసేన పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.



పలువురు నేతలు, కార్యకర్తల పాల్గొనటం



ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, కొమర్రాజు శ్రీను, అనిల్ నాయుడు, లింగయ్య, సాయి, చరణ్, రాకేష్ నాయుడు, గంట సైదులు, నరేందర్, పండు, అఖిల్, గణేష్, వినయ్, భార్గవ్, బద్రి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.