Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి– జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

Author
Posted By DAINAMIC NEWS
| 17 Feb 2026, 05:49 AM | తాజా సమాచారం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి– జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్


నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 17



ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం పర్వతగిరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.



రికార్డులు, మందుల స్టాక్‌పై ప్రత్యేక దృష్టి



ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, మందుల స్టాక్ రిజిస్టర్, స్టోర్ గది, మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, మందుల స్టాక్ రిజిస్టర్‌ను నిరంతరం అప్డేట్ చేయాలని ఆదేశించారు.మందుల అందుబాటుపై వివరాలు తెలుసుకొని, అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పుడు నిల్వలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.



గర్భిణీలకు సమగ్ర వైద్య పరీక్షలు


ఇవి కూడా చదవండి


గర్భిణీ స్త్రీలకు ప్రతినెల నిర్వహించే వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి, ప్రసవ సమయానికి సురక్షితంగా సాధారణ ప్రసవం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు.



భవన మరమ్మతులపై ప్రతిపాదనలు పంపాలి



ఆరోగ్య ఉప కేంద్ర భవనం పై పెచ్చులు ఊగుతున్న విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ సూచించారు.



కార్యక్రమంలో పాల్గొన్నారు



ఈ తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కృష్ణవేణి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మెడికల్ అధికారి రామకృష్ణ, ఎం.ఎల్.హెచ్.పి ఊర్మిల, ప్రియదర్శిని, ఆశ, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.