Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దమ్ము చక్రాల ట్రాక్టర్లతో రోడ్లపైకి రాకూడదు– జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరిక

Author
Posted By DAINAMIC NEWS
| 22 Jan 2026, 03:37 AM | తాజా సమాచారం
దమ్ము చక్రాల ట్రాక్టర్లతో రోడ్లపైకి రాకూడదు– జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరిక


సూర్యాపేట బ్యూరో, జనవరి 22 , డైనమిక్ న్యూస్



ప్రజల రవాణా అవసరాల కోసం ప్రభుత్వం ఎంతో వ్యయంతో నిర్మించిన రహదారులను దమ్ము చక్రాలతో (ఐరన్ వీల్స్) ఉన్న ట్రాక్టర్లు ధ్వంసం చేస్తున్నాయని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.



రోడ్లు దెబ్బతింటున్నాయి – ప్రజల నుంచి ఫిర్యాదులు



దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావడం వల్ల రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని, దీనిపై ప్రజల నుంచి పోలీస్ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయని ఎస్పీ తెలిపారు.



రోడ్డు ప్రమాదాలకు కారణం



కొన్ని చోట్ల రోడ్లను తవ్వి అలాగే వదిలేయడం వల్ల వాహనదారులు గమనించక ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఇది ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి


రోడ్లు తవ్వితే సమాచారం ఇవ్వాలి



వ్యవసాయ పనులు లేదా ఇతర అవసరాల నిమిత్తం ఎవరైనా రహదారులను తవ్వాల్సి వస్తే, ముందుగా సంబంధిత శాఖ అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.



రైతులు, ట్రాక్టర్ యజమానులు సహకరించాలి



దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే రహదారులు ధ్వంసమవడంతో పాటు ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. రైతులు, ట్రాక్టర్ యజమానులు ఈ విషయాన్ని గమనించి దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపైకి తేవద్దని కోరారు.



నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా



ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 వరకు జరిమానా విధించబడుతుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ హెచ్చరించారు.