Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పేకాట శిబిరం పై పోలీసుల దాడి…

Author
Posted By DAINAMIC NEWS
| 19 Nov 2025, 08:39 AM | ఆంధ్ర ప్రదేశ్
పేకాట శిబిరం పై పోలీసుల దాడి…


డైనమిక్ న్యూస్,చిలకలూరిపేట, నవంబర్ 19



పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లోని
యడ్లపాడు మండలం లింగరావుపాలెం గ్రామంలో పేకాట స్థావరాల పై పోలీసులు బుధ వారం దాడి చేసారు.యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగరావుపాలెం గ్రామంలో జరుగుతున్న కోతముక్క ఆట పై ఎడ్లపాడు పోలీసులు బుధవారం ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ చర్యలో మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి రూ. 10,240 నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ టి.శివరామకృష్ణ మాట్లాడుతూ అక్రమ జూదం సహా అన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ఇటువంటి దందాలు ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి,తమ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచార మివ్వాలని ఎస్ఐ కోరారు.

ఇవి కూడా చదవండి