Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ నేతల నిరాహార దీక్ష రైతు హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్

Author
Posted By DAINAMIC NEWS
| 17 Nov 2025, 10:33 AM | తాజా సమాచారం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ నేతల నిరాహార దీక్ష రైతు హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్


సూర్యాపేట బ్యూరో, నవంబర్ 17, డైనమిక్ న్యూస్



ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం బీజేపీ నేతలు రైతు సమస్యలపై 24 గంటల నిరాహార దీక్ష నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మి నర్సయ్య ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ధాన్యంపై బోనస్ వెంటనే చెల్లించాలి, ఫసల్ భీమా పథకాన్ని అమలు చేయాలి, ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని వారు స్పష్టం చేశారు.ఈ నిరాహార దీక్షలో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి పాల్గొని, రైతుల హక్కుల కోసం పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించేవరకు బీజేపీ మరింత బలమైన ఉద్యమాలు చేస్తుందని నాయకులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి