Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నీలకంటేశ్వర స్వామివారికి నిత్య చద్దీ కార్యక్రమంలో పాల్గొన్నా టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి

Author
Posted By DAINAMIC NEWS
| 17 Nov 2025, 10:21 AM | ఆంధ్ర ప్రదేశ్
నీలకంటేశ్వర స్వామివారికి నిత్య చద్దీ కార్యక్రమంలో పాల్గొన్నా టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి


కారం పూడి, డైనమిక్, నవంబర్ 17



మండల పరిధిలోని ఇనుపరాజు పల్లి గ్రామంలో సోమవారం నాగులేరు ఒడ్డున గంగా పార్వతీ సమేత నీలకంటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం నిత్య చద్దీ కార్యక్రమం భక్తి పరవశంలో జరిగింది.



ముఖ్య అతిథిగా జంగా కృష్ణమూర్తి ప్రత్యేక పూజలు



కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.



సురేష్ యాదవ్ దంపతుల ద్వారా చద్దీ సమర్పణ



మండల టీడీపీ అధ్యక్షులు గోళ్ల సురేష్ యాదవ్ నిత్య చద్దీ కార్యక్రమం లో భాగంగా స్వామి వారికి చద్దీ సమర్పించారు. అనంతరం స్వామివారికి వడ్డించి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి



దాత దంపతులకు ఘన సన్మానం



చద్దీ సేవ నిర్వహించిన సురేష్ యాదవ్ దంపతులను కమిటీ సభ్యులు, జంగా కృష్ణమూర్తి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ లతో కలిసి ఘనంగా సన్మానించారు.



నేతల సమక్షంలో కార్యక్రమం



ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ నేతలు గుర్రపుశాల శ్రీనివాసరావు, చల్లా సుబ్బయ్య, ఆర్‌.ఐ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.