Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రబీ సీజన్ కు యూరియా కొరత లేదు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన ఏడీఏ రమేష్ బాబు

Author
Posted By DAINAMIC NEWS
| 12 Nov 2025, 07:23 AM | తాజా సమాచారం
రబీ సీజన్ కు యూరియా కొరత లేదు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన ఏడీఏ రమేష్ బాబు


తుంగతుర్తి, నవంబర్ 12,డైనమిక్



వచ్చే రబీ సీజన్ కు యూరియా కొరత లేదని 100 నుండి 120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని యూరియా కొరకు రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ బాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రం లోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్‌ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్సును పరిశీలించారు. ఎరువుల వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. ఎరువులను పీఓఎస్ మిషన్ ద్వారానే విక్రయించాలని, రైతుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలన్నారు.రైతులు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాతే ఎరువులు విక్రయించాలని, ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆయన దుకాణ యజమానులకు స్పష్టం చేశారు.ఫెర్టిలైజర్ నిర్వాహకులు అక్రమాలు చేసిన కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి