Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా లక్ష్మీనరసింహ స్వామివారికి నిత్యాభిషేకాలు

Author
Posted By DAINAMIC NEWS
| 11 Nov 2025, 05:17 AM | తాజా సమాచారం
ఘనంగా లక్ష్మీనరసింహ స్వామివారికి నిత్యాభిషేకాలు


మఠంపల్లి, నవంబర్ 11 (డైనమిక్ న్యూస్)



సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి మహాక్షేత్రంలో మంగళవారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికినిత్యాభిషేకాలు, హోమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి సేవలో పాల్గొన్నారు.



కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమాలు



కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కటాక్షం పొందారు.


ఇవి కూడా చదవండి


నిత్య కళ్యాణం వైభవంగా



తదుపరి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా దేవాలయ అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యుల పర్యవేక్షణలో నిర్వహించారు.ఈ కళ్యాణంలో దంపతులు బొల్లా అశోక్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.



భక్తులకు అన్నప్రసాద వితరణ



దేవాలయంలో రోజువారీగా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో మంగళవారం 114 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.భక్తుల సేవలో భాగంగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని దేవస్థాన అధికారులు తెలిపారు.