Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణ మహిళలకు శుభవార్త..!ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఉచిత చీరల పంపిణీ

Author
Posted By DAINAMIC NEWS
| 20 Oct 2025, 10:14 PM | తాజా సమాచారం
తెలంగాణ మహిళలకు శుభవార్త..!ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఉచిత చీరల పంపిణీ


హైదరాబాద్‌,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 21



తెలంగాణ మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్‌ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.మొదట బతుకమ్మ కానుకగా అందించాల్సిన ఈ చీరల పంపిణీ, తయారీ ఆలస్యంతో వాయిదా పడింది. ప్రస్తుతం చీరల తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి. నవంబర్‌ 15 నాటికి మొత్తం తయారీ పూర్తి చేసి, 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.మొత్తం 1.94 లక్షల మంది మహిళలకు ఈ ఉచిత చీరలు అందించనున్నారు. సిరిసిల్ల, వరంగల్‌, కరీంనగర్‌ ప్రాంతాల్లో నేసిన, ఒక్కొక్కటి సుమారు రూ.800 విలువ గల నాణ్యమైన చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.ఈ కార్యక్రమం ద్వారా మహిళా శక్తి, స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతం ఇవ్వనుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి