Saturday, April 18, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కారంపూడి మండల పరిషత్ అధ్యక్షురాలు మేకల శారదపై అవిశ్వాస తీర్మానం — టీడీపీ నేతల అభినందనలు

కారంపూడి మండల పరిషత్ అధ్యక్షురాలు మేకల శారదపై అవిశ్వాస తీర్మానం — టీడీపీ నేతల అభినందనలు

డైనమిక్,కారంపూడి, అక్టోబర్ 22:


మండల పరిషత్ అధ్యక్షురాలు మేకల శారదపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు అభినందించారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల అనంతరం మేకల శారద ప్రజలకు, ఎంపీటీసీ సభ్యులకు అందుబాటులో లేకుండా, మండల పరిషత్ కార్యాలయానికి రాకుండా అభివృద్ధి కార్యక్రమాలను కుంటుపరిచారని విమర్శించారు.టీడీపీ ఎంపీటీసీ బోల్నేడి కనకదుర్గ శ్రీనివాసరావు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలకడం సంతోషకరమని నేతలు తెలిపారు. రాబోయే రోజుల్లో అందరూ కలిసి మండల అభివృద్ధికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.అవిశ్వాసానికి మద్దతు తెలిపిన ఎంపీటీసీ సభ్యులు వేముల పద్మ లింగయ్య, ఆరీఫ్, అమృతలక్ష్మి, డేవిడ్, కూనిరెడ్డి సైదారెడ్డి తదితరులకు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పంగులూరు అంజయ్య, మండల టీడీపీ అధ్యక్షులు గోళ్ల సురేష్ యాదవ్, బోల్నేడి శ్రీనివాసరావు, ఉన్నం లక్ష్మీనారాయణ, మునుగోటి సత్యం, చప్పిడి రాము, బొమ్మిన శేషగిరి, సొసైటీ అధ్యక్షుడు నాగారపు రామకృష్ణ, చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, బాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments