Saturday, April 25, 2026
Homeతాజా సమాచారంనేడు నేరేడుచర్ల–హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన

నేడు నేరేడుచర్ల–హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,జనవరి 20

రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు నేరేడుచర్ల, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలు

మధ్యాహ్నం 01.30 గంటలకు నేరేడుచర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొంటారు.అనంతరం సాయంత్రం 07.00 గంటలకు హుజూర్‌నగర్‌లోని మంత్రిగారి నివాసంలో మరో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.

స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ

మధ్యాహ్నం 02.00 గంటలకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేయనున్నారు.అలాగే 04.00 గంటలకు హుజూర్‌నగర్ MPDO కార్యాలయంలో మరో విడతగా వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ జరగనుంది.

రూ.200 కోట్ల యంగ్ ఇండియా స్కూల్ పనుల సమీక్ష

మధ్యాహ్నం 03.00 గంటలకు గడ్డిపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

వికలాంగులకు పరికరాలు, CMRF చెక్కుల పంపిణీ

హుజూర్‌నగర్ MPDO కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో వికలాంగులకు బ్యాటరీ వీల్‌చైర్స్, వినికిడి పరికరాలు, ల్యాప్‌టాప్స్, 5జి మొబైల్స్, ట్రై స్కూటర్స్ పంపిణీ చేయడంతో పాటు CMRF చెక్కులను మంత్రి అందజేయనున్నారు.

మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం

సాయంత్రం 05.00 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహా క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొననున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments