Wednesday, April 22, 2026
Homeతాజా సమాచారంఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీలతో ప్రజలపై భారం ప్రభుత్వంపై...

ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీలతో ప్రజలపై భారం ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత భాస్కర్ విమర్శలు

టేక్మాల్, ఏప్రిల్ 23,శుభోదయ డైనమిక్ వార్త

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా అల్లకల్లోలమైందని బీఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయికోటీ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

ప్రజలకు పెరిగిన ప్రయాణ భారం

ప్రైవేట్ టాక్సీలు, ఆటోలు ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకుని రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని భాస్కర్ ఆరోపించారు. రోజువారీ అవసరాల కోసం బయటకు వెళ్లడం కూడా ప్రజలకు భారంగా మారిందని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఉచిత బస్సు సౌకర్యం పేరుతో ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై భాస్కర్ ఘాటుగా విమర్శించారు. ఆర్టీసీ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు.

తక్షణ పరిష్కారం కోరుతూ డిమాండ్

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యే స్థితి ఏర్పడిందని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments