Thursday, April 23, 2026
Homeతాజా సమాచారంరామానుజన్ జయంతి సందర్భంగా మండలస్థాయి గణిత ప్రతిభా పోటీలు

రామానుజన్ జయంతి సందర్భంగా మండలస్థాయి గణిత ప్రతిభా పోటీలు

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 20

తెలంగాణా గణిత ఫోరం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని శనివారం నేరేడు చర్ల మండలస్థాయి గణిత ప్రతిభా పోటీ పరీక్షలు నిర్వహించారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు చేతుల మీదుగా అందజేశారు.

రామానుజన్ ఆదర్శంగా తీసుకోవాలి

ప్రధానోపాధ్యాయులు బట్టు మధుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ బాల్యంనుంచే గణితంపై ప్రత్యేక మక్కువ పెంచుకుని గణిత శాస్త్రవేత్తగా ఎదిగి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినగణిత మేధావి”గా నిలిచారని తెలిపారు.
విద్యార్థులు రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకుని గణితంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

ఇంగ్లీష్ మీడియం విజేతలు

ఇంగ్లీష్ మీడియం విభాగంలోప్రథమ స్థానం – ఓ. పూజిత్ రెడ్డి (జెడ్పీహెచ్ఎస్, దిర్శించర్ల)ద్వితీయ స్థానం – టి. రోహన్ (జెడ్పీహెచ్ఎస్, నేరేడుచర్ల)ద్వితీయ స్థానం – సిహెచ్. సౌమ్య (జెడ్పీహెచ్ఎస్, దాచారం)విద్యార్థులు గెలుచుకున్నారు.

తెలుగు మీడియం విజేతలు

తెలుగు మీడియం విభాగంలోప్రథమ స్థానం – పి. వీర లక్ష్మణ్ (జెడ్పీహెచ్ఎస్, మేడారం)ద్వితీయ స్థానం – కె. నతన్య (జెడ్పీహెచ్ఎస్, చింతకుంట్ల)విజేతలుగా నిలిచారు.కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో గణితోపాధ్యాయులు కట్టా వెంకటేశ్వరరావు, కొణతం వెంకటరెడ్డి, అన్నపూర్ణ, టి.ఎల్. నరసింహారావు, సిహెచ్. ప్రభాకర్ రెడ్డి, డి. శ్రీనివాస్, గోవింద్ తదితర పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments