మఠంపల్లి, డైనమిక్ న్యూస్ , జనవరీ 23
రాష్ట్ర మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధుల (CMRF) చెక్కును రామచంద్రపురం తండా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోతు భీముడు నాయక్‌కు అందజేశారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో చెక్కు అందజేత
రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య మంజు నాయక్ ఆధ్వర్యంలో ఈ చెక్కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని నేతలు తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణుల విస్తృత పాల్గొనడం
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మూడవత్ కొండా నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ధరావత్ నవీన్ నాయక్, సేవాలాల్ సంఘం అధ్యక్షులు బానోతు తులసి రామ్ నాయక్, మఠంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బానోతు భాస్కర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ తివి పులి శ్రీనివాస్, యాతవాకిళ్ల సర్పంచ్ కుక్కల నాగరాజు, సిరి హాస్పిటల్ ఎండీ బానోతు నాగు నాయక్, మాజీ సర్పంచ్ బానోతు కిషన్ నాయక్, భూక్య రాయసల్, గూగులోతు సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేదలు, బాధితుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధుల ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.
