Saturday, April 18, 2026
Homeతాజా సమాచారంయుద్ధ ప్రాతిపదికన హుజూర్నగర్ జాబ్ మేళా ఏర్పాట్లు యువత భారీగా పాల్గొని ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం...

యుద్ధ ప్రాతిపదికన హుజూర్నగర్ జాబ్ మేళా ఏర్పాట్లు యువత భారీగా పాల్గొని ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

డైనమిక్,సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 23

జిల్లాలో జరుగనున్న హుజూర్నగర్ మెగా జాబ్ మేళా ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ (శనివారం) హుజూర్నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ మేళా జరగనుంది.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. యువత భారీ సంఖ్యలో హాజరై ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

స్టాల్స్ కేటాయింపులపై సూచనలు

కంపెనీల వారీగా స్టాల్స్ కేటాయింపుల వివరాలను వెంటనే సమర్పించాలంటూ సింగరేణి ప్రతినిధి చందర్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద రద్దీని నివారించేందుకు రంగాల వారీగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

భారీగా అభ్యర్థులు హాజరవుతారని భావిస్తూ పార్కింగ్, భోజనాలు, విశ్రాంతి కోసం అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.
కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణను పార్కింగ్ ప్రదేశాలు, కుర్చీలు, రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద సక్రమ సదుపాయాలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.జాబ్ మేళా ప్రాంగణానికి అప్రోచ్ రోడ్లు వేయడం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం, అభ్యర్థుల సౌకర్యార్థం జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వర్షం కురిసిన సందర్భంలో మేళా ప్రాంగణం, స్వర్ణ వేదిక హాల్, పార్కింగ్ ప్రదేశాల్లో వాటర్‌ప్రూఫ్ టెంట్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఎస్పీ ప్రసన్న కుమార్, సింగరేణి ప్రతినిధి చందర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి శంకర్, ఇండస్ట్రీస్ జీఎం సీతారాం నాయక్, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాస్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సరోత్తం రెడ్డి, కొప్పల వేణారెడ్డి, చింతల లక్ష్మీనారాయణ రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, తన్నీరు మల్లిఖార్జున్, పోతు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments