Monday, June 15, 2026
Homeతాజా సమాచారంమున్సిపల్ ఎన్నికల భద్రతపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

మున్సిపల్ ఎన్నికల భద్రతపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 3

శాంతియుత ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు

మున్సిపాలిటీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ జిల్లాలోని పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా


సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి ముందస్తు బైండోవర్ చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు.

జిల్లాలో కట్టుదిట్టమైన బందోబస్తు

ఎన్నికల కోసం బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సామాగ్రి మరియు స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, చెక్ పోస్టుల తనిఖీలు, మద్యం అమ్మకాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.

విజయోత్సవ ర్యాలీలపై నిషేధం

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, డీజేలు, భానాసంచాలపై నిషేధం ఉన్నదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments