Monday, March 2, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్లకు అభివృద్ధి బాటమూడేళ్లలో మున్సిపాలిటీ రూపురేఖలు మార్చుతా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం...

నేరేడుచర్లకు అభివృద్ధి బాటమూడేళ్లలో మున్సిపాలిటీ రూపురేఖలు మార్చుతా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 20

రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధితో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పాలన సాగించడమే తన ప్రజాజీవిత సంకల్పమని స్పష్టం చేశారు.

మహిళా శక్తికి ఆర్థిక భరోసా

నేరేడుచర్ల మున్సిపాలిటీ ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని 404 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.52,07,399 వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఇందిరమ్మ చీరలతో గౌరవం – భరోసా

ఇందిరా మహిళా శక్తి పథకం కింద 5,498 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడుతూ వారికి ప్రభుత్వమే అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.

ప్రజాసేవే నా తపస్సు

తాను ప్రజాజీవితాన్ని తపస్సులా సాగిస్తున్నానని, పాలనలో ప్రతి నిర్ణయం పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తీసుకుంటున్నానని మంత్రి స్పష్టం చేశారు.

రోడ్లు – విద్య – వైద్యంలో చరిత్రాత్మక అభివృద్ధి

మిర్యాలగూడ నుంచి నేరేడుచర్ల, కోదాడ మీదుగా ఖమ్మం జాతీయ రహదారి వరకు రహదారి నిర్మాణాన్ని గతంలో తానే చేపట్టినట్లు గుర్తు చేశారు.
హుజూర్నగర్‌లో రూ.7.50 కోట్లతో జూనియర్ కళాశాల, రూ.4.50 కోట్లతో డిగ్రీ కళాశాల భవనాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.2.5 కోట్లతో సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిరుద్యోగులకు ఉద్యోగమే లక్ష్యం

హుజూర్నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాల్లో 40 వేల మంది నమోదు కాగా 4,500 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. యువతకు ఉపాధే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

పేదల పళ్లెంలో సన్నబియ్యం

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.

వడ్డీ లేని రుణాలు మహిళలకు పెద్ద అండ – కలెక్టర్

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఆర్థికంగా పెద్ద భరోసా అని అన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ చీరలను అర్హులైన వారికే పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.

ప్రముఖుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ కే. నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments