నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 16
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేరు, ఫోటోను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు ఒక నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫేక్ ఖాతా నుండి ప్రజలకు మెసేజ్‌లు పంపిస్తూ డబ్బులు అడుగుతున్నట్లు నివేదికలు రావడంతో జిల్లా పోలీస్ వ్యవస్థ అప్రమత్తం అయ్యింది. “ఈ ఫేక్ ప్రొఫైల్ కు ప్రజలు ఎవరు కూడా స్పందించ వద్దు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు
జిల్లా ప్రజలకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేస్తూ—
“Sharath Chandra Pawar Ips (SP Nalgonda) అని కనిపించే ఫేస్‌బుక్ ఖాతా పూర్తిగా నకిలీది. నేను ఉపయోగించే అధికారిక పేజీకి తప్ప మరో ఏ ఖాతా ద్వారా నేను ప్రజలకు మెసేజ్ చేయను. ఏ విధమైన ఆర్థిక సహాయం కోరినా, ఖాతా వివరాలు అడిగినా, లింకులు పంపినా ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యం చేయాల”ని సూచించారు.సైబర్ నేరగాళ్లు అధికారి పేర్లను, ఫోటోలను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ప్రొఫైళ్లను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలి. ఏ సందేహాస్పద మెసేజ్ వచ్చినా అధికారిక నంబర్లలో పోలీసులను సంప్రదించాలి” అని తెలియజేశారు.
ప్రజలకు ప్రత్యేక సూచనలు
అధికారుల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు,డబ్బులు అడిగే మెసేజ్ లకు అసలు స్పందించవద్దు,నకిలీ ఖాతాలను వెంటనే Report చేయాలి,సైబర్ క్రైం సంబంధిత ఫిర్యాదులకు 1930 హెల్ప్‌లైన్ ఉపయోగించాలి
సైబర్ నేరాలపై కఠిన చర్యలు
ప్రజలను మోసం చేయడమే ఉద్దేశంగా ఫేక్ అకౌంట్లు సృష్టించే మోసగాళ్లపై ప్రత్యేక దర్యాప్తు చేపడతామని ఎస్పీ తెలిపారు. ఇటువంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
