Saturday, April 18, 2026
Homeతాజా సమాచారంచెంచుల సమస్యల పరిష్కారానికి తాండాకే చేరుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉదయం 8 గంటలకే అధికార...

చెంచుల సమస్యల పరిష్కారానికి తాండాకే చేరుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉదయం 8 గంటలకే అధికార యంత్రాంగంతో నెల్లికల్ చెంచు వాని తండా సందర్శన “మా వద్దకే వచ్చారంటే ఎంతో ఆనందం” అని చెంచుల కృతజ్ఞత

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ , నవంబర్ 21

నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ చెంచు వాని తాండా అభివృద్ధి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఉదయం 8 గంటలకు శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి తాండాను సందర్శించారు. తాండాకు వచ్చిన కలెక్టర్‌ను చెంచులు సాంప్రదాయరీతిలో స్వాగతం పలికారు.

ప్రజావాణిలో చెంచు మహిళ పిటిషన్‌తో స్పందించిన కలెక్టర్

ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణిలో చెంచు వాని తాండాకు చెందిన ఆదెమ్మ తమ తాండాలో ఆధార్ కార్డు, ధ్రువపత్రాల లేమి కారణంగా ఏ పథకం లభించడం లేదని తెలియజేయడంతో ఈ సమస్యపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.చెంచు తాండాకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించిన కలెక్టర్ వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

చెంచుల సమస్యలు—కలెక్టర్ ముందుకు వచ్చిన విన్నపాలు

చెంచులు తమకు ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్ ముందుంచారు:కొంతమందికి ఆధార్ కార్డులే లేవు, ఉన్నవారికి అప్డేషన్ లేదు,తాగునీటి బోరు మరమ్మతు అవసరం,పిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాలకు 6 కేజీల బియ్యం సరిపోవడం లేదు,అంత్యోదయ యోజన కింద 32 కిలోల బియ్యం ఇవ్వాలన్న అభ్యర్థన,రేషన్ కార్డులు పెండింగ్‌లో ఉండటం,ఉపాధి హామీ జాబ్ కార్డులు లేమి,నెట్‌వర్క్ లేక అత్యవసర సమాచార ప్రసారం కష్టతరం,తాండాలోనే చెంచుల నుంచే ఆశ, అంగన్‌వాడి, ఏఎన్ఎం నియామకాలు చేయాలన్న డిమాండ్ తో వివిధ శాఖల అధికారుల వివరణ అడిగి తెలుసుకున్నారు

వివిధ శాఖల అధికారుల వివరణలు

తాండాలోనే చెంచుల సమక్షంలో పథకాలపై వివరాలు ఇచ్చిన అధికారులు,డిఆర్డిఓ శేఖర్ రెడ్డి,గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్,జిల్లా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్,పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్,పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులు,వీరు చెంచులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సవివరంగా వివరించారు.

“ప్రతి చెంచు కుటుంబానికి ధ్రువపత్రాలు తప్పనిసరి” – కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ

ఆధార్, కులం, పుట్టిన తేదీ వంటి ధ్రువపత్రాల లేమితో చెంచులు పథకాల లబ్ధి పొందడం లేదని,ఇకపై చెంచులు నల్గొండకు తిరగవలసిన అవసరం లేకుండా తాండాలోనే సమస్యలు పరిష్కరిస్తామని,పెన్షన్లు మూడు నెలలకు మించి తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని,సాగు భూములను వదిలిపెట్టకుండా వ్యవసాయం కొనసాగించాలని సూచించారుఅలాగే,తాండాలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని,ఉపాధి హామీ జాబ్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు

అటవీ భూములపై కొత్త సాగులు చేయవద్దని హెచ్చరిక

ఆరోగ్యం–విద్య–సౌకర్యాలపై కీలక నిర్ణయాలు,ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.తాండాకు అత్యవసర కమ్యూనికేషన్ కోసం ఎయిర్టెల్ లేదా బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేస్తామని,గ్రామపంచాయతీ భవనం, అంగన్‌వాడి కేంద్రం, ప్రభుత్వ సంస్థ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని,ప్రతి తాండా వాసికి శాశ్వత ఆధార్ కార్డులు జారీ చేసి, తప్పులను సరిచేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

చెంచుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎం.ఎల్.ఎ

శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మాట్లాడుతూ:

అధికారులు తాండాకే వచ్చి సమస్యలు పరిష్కరించాలనే తపన అభినందనీయమని తాగునీటి బోర్ మోటర్ మరమ్మతు సహా అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

ఆధార్ సర్వీసుల శిబిర ప్రారంభం

మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ ఆధార్–మీ సేవ అప్డేషన్ సేవల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు.72 మంది ఆధార్ అప్డేషన్ పూర్తికాగా 21 మందికి కొత్త ఆధార్ కార్డులు జారీ చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments