నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన చిలకరాజు కరుణాకర్‌ను భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా ఐటీ సెల్ కన్వీనర్‌గా పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి నియమించారు.
“పార్టీ బలోపేతానికి శ్రమిస్తాను” – కరుణాకర్
ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ—
“నాపై ఉంచిన నమ్మకానికి జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తాను. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తులో తప్పకుండా గుర్తింపు, పదవులు లభిస్తాయని నమ్ముతున్నాను” అని పేర్కొన్నారు.
కేంద్ర పథకాల ప్రచారంపై ప్రత్యేక దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, కేంద్ర నిధులతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తానని కరుణాకర్ తెలిపారు.
పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా పదాధికారులకు, మండల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు కరుణాకర్ ధన్యవాదాలు తెలిపారు.
