Thursday, September 17, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్లలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

నేరేడుచర్లలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

నేరేడుచర్ల, సెప్టెంబర్ 17,శుభోదయ డైనమిక్ వార్త

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నేరేడుచర్ల పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సురిగి సైదులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

పలు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ

ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ రామకృష్ణ, వ్యవసాయ కార్యాలయంలో ఏఓ జావీద్, మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి సన్నీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, కమిషనర్ నాగరాజు,కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments