నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 14
నేరేడుచర్ల మున్సిపాలిటీలో 5వార్డు లో నరసయ్య గూడెం లో పోషణ మాసోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు ఆరోగ్యం, పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఆరోగ్యంపై సూచనలు అందించిన ఏఎన్ఎం, అంగన్వాడీ సిబ్బంది
కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత, అంగన్వాడీ టీచర్ బి. విజయతో పాటు సిబ్బంది పాల్గొని మహిళలు, చిన్నారులకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు.గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
