Sunday, June 7, 2026
Homeతాజా సమాచారంఅంగన్వాడీ కేంద్రంలో ఏఎల్‌ఎంసీ కమిటీ సమావేశం గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి : వైస్ చైర్మన్...

అంగన్వాడీ కేంద్రంలో ఏఎల్‌ఎంసీ కమిటీ సమావేశం గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి : వైస్ చైర్మన్ సందీప్ కుమార్ రెడ్డి

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, మార్చి 7

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డు రామాపురం రోడ్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఏఎల్‌ఎంసీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

పిల్లలకు అక్షరాభ్యాసం

ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్య, పోషకాహారం ద్వారా పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

సమయానికి టీకాలు వేయించాలి

పుట్టిన పిల్లలకు సమయానికి టీకాలు వేయించడం ఎంతో అవసరమని తల్లులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆరోగ్య లక్ష్మి కార్యక్రమానికి హాజరు కావాలి

అంగన్వాడీ కేంద్రాల్లో పోషక విలువలతో కూడిన బాలామృతం అందిస్తున్నారని తెలిపారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ప్రభుత్వం ప్రత్యేక పోషకాహారం అందిస్తోందన్నారు. బాలింతలు ప్రతిరోజూ ఆరోగ్య లక్ష్మి కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు యడవల్లి సరిత, ఆయా పద్మ, ఆశా కార్యకర్త యశోద, ఆర్పీ నాగలక్ష్మి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Subscribe