డైనమిక్ ,హాలియా, అక్టోబర్ 31
సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవాన్ని హాలియాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ సతీష్ రెడ్డి ప్రధాన అతిథిగా హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ పటేల్ భారత ఏకీకరణకు ప్రాణం అర్పించిన మహానేత అని, ఆయన స్ఫూర్తితో ప్రతి పౌరుడు దేశ సమైక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సై సాయి ప్రశాంత్, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.జెండా ఆవిష్కరణ అనంతరం హాలియా బస్టాండ్ నుంచి సెంటర్ వరకు ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, పోలీసులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని “ఐక్య భారత్ – శ్రేష్ఠ భారత్” నినాదాలు గర్జించారు.


