నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,,సెప్టెంబర్ 17
నేరేడుచర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ పర్వతం వెంకన్న ఆధ్వర్యంలో గ్రామంలో శ్రమదానం చేపట్టారు.
పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన
గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణశ్రీ, వార్డు సభ్యులు ఎదురుగట్ల శైలజ, పర్వతం చంద్రగిరి, వానరాసి ధనమ్మ, గ్రామస్తులు భద్రయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
