నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త,ఆగస్టు 3
వంటగ్యాస్ సిలిండర్ల e-KYC ప్రక్రియపై వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. అధికారికంగా ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఆగస్టు 1 నుంచే e-KYC పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ బుకింగ్‌లను రద్దు చేస్తూ సిలిండర్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్లు వెల్లడిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే e-KYC పూర్తి చేసిన వారికి ఆందోళన అవసరం లేదు
ఇప్పటికే e-KYC పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. కేవలం పెండింగ్‌లో ఉన్నవారు మాత్రమే e-KYC పూర్తి చేయాలని సూచించాయి.
ఏజెన్సీ, డెలివరీ బాయ్, ఆన్‌లైన్‌లో సౌకర్యం
వినియోగదారుల సౌకర్యార్థం గ్యాస్ ఏజెన్సీల్లో, డెలివరీ బాయ్‌ల ద్వారా లేదా ఆన్‌లైన్ విధానంలో e-KYC పూర్తి చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. గడువులోగా e-KYC పూర్తి చేసి గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని వినియోగదారులకు సూచించారు.
