నేరేడుచర్ల, జూలై 27 ,శుభోదయ డైనమిక్ వార్త
నేరేడుచర్ల మండల ప్రజా పరిషత్ సమీక్షా సమావేశం మంగళవారం (జూలై 28) ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి వి. మోహన్‌బాబు అధ్యక్షతన నిర్వహించనున్నారు. సమావేశానికి మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల పూర్తి ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీఓ సోమ సుందర్ రెడ్డీ ఒక ప్రకటనలో తెలిపారు . పంచాయతీ కార్యదర్శులు సర్పంచులకు స్వయంగా సమాచారం అందించి వారి హాజరు నిర్ధారించాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటలు, అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్ష
సమావేశంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగు తగ్గించి తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించనున్నారు. అలాగే VDG RAMG జలసిరి పథకం కింద ప్రతి గ్రామంలో కనీసం రెండు ఫామ్‌పాండ్లు, ఫిష్‌పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, సోక్‌పిట్లు, పర్కొలేషన్ ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాల పురోగతిని సమీక్షించనున్నారు. అదనంగా విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, విద్య, పశుసంవర్ధక తదితర శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.
