నేరేడుచర్ల, జూలై 24,శుభోదయ డైనమిక్ వార్త
హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె. శ్రీనివాస్ నేరేడుచర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం పోలింగ్ స్టేషన్ బీఎల్ఓలతో (BLOలు) ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రోగ్రెస్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఎల్ఓలు చేపడుతున్న క్షేత్రస్థాయి పనుల పురోగతిని పరిశీలించిన ఆర్డీవో కె. శ్రీనివాస్, ఇంటింటి సర్వేను వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ సైదులు, సంబంధిత అధికారులు, బీఎల్ఓలు పాల్గొన్నారు.

