Friday, September 11, 2026
Homedainamicయూరియా పేరుతో రైతులపై దోపిడీ..?

యూరియా పేరుతో రైతులపై దోపిడీ..?

  • గౌరీ శంకర్ ఫర్టిలైజర్స్‌పై తీవ్ర ఆరోపణలు? ప్రభుత్వ ధరకు అదనంగా రవాణా పేరుతో వసూళ్లు చేశారంటున్న రైతులు సిబ్బంది అవమానకరంగా ప్రవర్తించారని ఆవేదన దుకాణంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి….

నేరేడుచర్ల, జూన్ 26,శుభోదయ డైనమిక్

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలోని బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన పర్శన బోయిన సైదులు అనే రైతు యూరియా విక్రయాల విషయంలో గౌరీ శంకర్ ఫర్టిలైజర్స్ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా బస్తాకు రూ.266 మాత్రమే చెల్లించాల్సి ఉండగా, ఐదు బస్తాలకు రూ.1,330 ఫోన్‌పే ద్వారా చెల్లించిన తర్వాత కూడా రవాణా ఖర్చు పేరుతో మరో రూ.170 వసూలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

రవాణా పేరుతో అదనపు భారం

ప్రభుత్వ నిర్ణయించిన ధరకు మించి అదనపు మొత్తాలు వసూలు చేయడం రైతులపై ఆర్థిక భారం మోపే చర్య అని రైతులు అంటున్నారు. నేరేడుచర్ల, దిర్శించర్ల పరిధిలోని గౌరీ శంకర్ ఫర్టిలైజర్స్‌లో ఈ విధమైన వసూళ్లు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.

రైతుల పట్ల అవమానకర ప్రవర్తన

యూరియా కోసం దుకాణానికి వెళ్లిన రైతులతో సిబ్బంది మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని, ప్రశ్నిస్తే “ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానించడం తగదని వారు పేర్కొన్నారు.

విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి

అధిక ధరలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వ్యవసాయ శాఖ, ఎరువుల నియంత్రణ అధికారులు వెంటనే విచారణ జరిపి, అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత ఫర్టిలైజర్స్ దుకాణంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అవసరమైతే లైసెన్స్‌ను సస్పెండ్ లేదా సీజ్ చేయాలని కోరారు.

కలెక్టర్ జోక్యం కోరుతున్న రైతులు

జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ ధరలకే ఎరువులు అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

మండల వ్యవసాయ అధికారి జావెద్ వివరణ

రవాణా ఖర్చులు ఇవ్వకూడదు యూరియా బస్తా గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకు మాత్రమే 266 కి ఇవ్వాలి ఎక్కువ అమౌంట్ వాసులు చేస్తే అలాంటి ఫార్టిలెజర్ షాపు పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాము అని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments