Saturday, September 12, 2026
Homeతాజా సమాచారంఎస్‌ఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ 14 వాహనాలు గుర్తింపు

ఎస్‌ఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ 14 వాహనాలు గుర్తింపు

నేరేడుచర్ల, మే 24,శుభోదయ డైనమిక్ వార్త

సూర్యాపేట జిల్లా ఎస్పీ సూచన మేరకు నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం స్థానిక ఎస్‌ఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేయగా, మైనర్లు నడుపుతున్న 14 వాహనాలను గుర్తించారు.

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్

గుర్తించిన మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశముందని వివరించారు.

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments