Friday, June 12, 2026
Homeతాజా సమాచారంసూర్యాపేట ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా పోలీసులు

సూర్యాపేట ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా పోలీసులు

సూర్యాపేట బ్యూరో, మే 22,శుభోదయ డైనమిక్ వార్త

సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ IPS పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఆ అకౌంట్ ద్వారా ప్రజలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ, తప్పుడు సందేశాలు పంపిస్తున్నారని హెచ్చరించారు.

ఫర్నిచర్ అమ్మకాల పేరుతో మోసం

నకిలీ అకౌంట్ ద్వారా “సెంట్రల్ పోలీస్ ఫోర్స్ లేదా ఆర్మీలో పని చేస్తున్న స్నేహితుడు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు.. మంచి ఫర్నిచర్ తక్కువ ధరకు అమ్ముతున్నాం” అంటూ మెసేజ్‌లు పంపించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లకు స్పందించవద్దు

ఎస్పీ పేరుతో వచ్చే ఎలాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు లేదా ఆర్థిక లావాదేవీలకు ప్రజలు స్పందించవద్దని సూచించారు. అనుమానాస్పద అకౌంట్లను వెంటనే ఫేస్‌బుక్‌లో “రిపోర్ట్” చేయాలని కోరారు.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఎవరికీ పంపవద్దని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments