గరిడేపల్లి, మే 22 ,శుభోదయ డైనమిక్ వార్త
ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న “చలో హైదరాబాద్” మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి కేంద్ర కమిటీ సభ్యుడు బానోతు వెంకటరామ్ నాయక్ పిలుపునిచ్చారు. గరిడేపల్లి మండల కేంద్రంలో గిరిజన నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన, అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా గిరిజనులకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.
చేవెళ్ల డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి
చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం లంబాడీలకు ఇచ్చిన 12 హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తూ శాసనసభలో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.
లంబాడీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు
లంబాడీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని, వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పలువురు గిరిజన నాయకుల పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గుగులోతు హేమ్లా నాయక్, మండల అధ్యక్షుడు సందీప్ నాయక్, గిరిజన నాయకులు బాలు నాయక్, రవీందర్ నాయక్, పులియా నాయక్, వెంకట్రాం, పుల్ సింగ్ నాయక్, శ్రీనివాస్, కోటయ్య, పాల రవీందర్, ఎస్ఆర్ ఛానల్ రాంబాబు, నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
